రాజమౌళి తో బాబు భేటీ వెనుక సీక్రెట్ ?

Rajamouli meets to chandrababu in Amravati for Designing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అమరావతి డిజైన్స్ కి సంబంధించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ రోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. లండన్ కి నార్మన్ ఫోస్టర్ సంస్థ అమరావతి డిజైన్ల రూపకల్పన పనిలో ఉన్నప్పటికీ, ఆ సంస్థ పని తీరులో ఎక్కడో భారతీయత మిస్ అయినట్టు బాబు ఫీల్ అవుతున్నారంట. అందుకే బాహుబలి దర్శకుడు రాజమౌళిని కూడా డిజైన్ల ఎంపిక అంశంలో భాగస్వామిని చేయాలని బాబు భావిస్తున్నారు. కానీ చాలా మంది ముఖ్యంగా వైసీపీ నేతలు, అభిమానులు పక్కా ప్రొఫెషనల్స్ చేసిన పనికి వంకలు పెట్టి, రాజమౌళిని ముందుకు తేవడాన్ని తప్పుపడుతున్నారు. కానీ వాళ్ళు అర్ధం చేసుకోవాల్సింది, జరుగుతున్నది వేరు. రాజమౌళితో రాజధాని స్కెచ్ లు వేయించడం లేదు. నార్మన్ ఫోస్టర్ రూపొందించిన నమూనాలో భారతీయత ఉట్టిపడేందుకు కొన్ని సూచనలు చేస్తారు. అది కూడా లుక్ వైస్ చేసే మార్పులు మాత్రమే.

ఇందులో చంద్రబాబుని విమర్శించే వాళ్ళు ఓ విషయాన్ని గమనించాలి. ఏ దేశానికైనా ఓ నిర్మాణ శైలి, శిల్పం ఉంటాయి. విదేశీయులు అందుకు సంబంధించిన పని చేస్తున్నప్పుడు మా సంప్రదాయ శైలి ఇలా ఉంటుందని ఎవరైనా ముందుగా చెబుతారు. దాన్ని కామెడీ చేస్తూ వైసీపీ అనుకూల మీడియా తెగ హడావిడి చేస్తోంది. బన్నీ సినిమాలో పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం వుంది కాబట్టి దర్శకుడు వినాయక్ ని అందులో భాగస్వామిని చేస్తారా అని సెటైర్స్ వేస్తున్నారు. అసలు జరిగేది ఏమిటి అనేది అర్ధం చేసుకోకుండా ఇలా సోషల్ మీడియా లో కామెడీ చేస్తున్న వైసీపీ చివరకు జనం దగ్గర కామెడీ అయిపోతున్న విషయం చూస్తూనే వున్నాం.