రేపు రాజమౌళితో బాబు భేటీ అందుకే…

Rajamouli Meets to Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అమరావతిలో ఏపీ అసెంబ్లీ , హై కోర్టు భవనాల తుది డిజైన్ ఎల్లుండి ఖరారు కానుంది. ఇందుకు సంబంధించి రేపు సీఎం చంద్రబాబు విస్తృతంగా కసరత్తు చేసే అవకాశం వుంది. రేపు ఉదయం నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, మంత్రి నారాయణ, crda కీలక అధికారులతో సమావేశమయ్యే చంద్రబాబు డిజైన్లకు సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. సాయంత్రం పూట దర్శకుడు రాజమౌళితో ఇదే అంశం మీద తుదివిడత సంప్రదింపులు చేస్తారు. ఇద్దరి అభిప్రాయాలు విన్నాక సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారు. ఎల్లుండి అధికారికంగా అసీంబ్లీ , హై కోర్టు భవనాలకు సంబంధించిన డిజైన్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన తర్వాత కూడా ఈ డిజైన్ లపై ప్రజల నుంచి సలహాలు , సూచనలు స్వీకరిస్తారు.