Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. అద్బుతమైన కథ మరియు విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను తెరకెక్కించిన రాజమౌళి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ‘బాహుబలి’ విడుదలై దాదాపు సంవత్సరం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు కూడా జక్కన్న తన తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లలేదు. ఇప్పటికే జక్కన్న తర్వాత మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఉండబోతుందని తేలిపోయింది. ఇక రాజమౌళికి అప్పుడప్పుడు వెండి తెరపై కనిపించడం అంటే సరదా. అందుకే జక్కన్న పలు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు, తన సినిమాల్లో కూడా తళుక్కున మెరవడం జరిగింది.
తాజాగా ఒక చిత్రంలో ఫుల్ లెంగ్త్ పాత్రను రాజమౌళి చేయబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రాజమౌళి శిష్యుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో అంతా కొత్త వారితో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ ఒక కథను సిద్దం చేశాడు. కరుణ్ కుమార్ దర్శకత్వంలో హరిప్రసాద్ కథ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కబోతున్న చిత్రంలో రాజమౌళి ఒక ముఖ్యమైన పాత్రను చేసేందుకు ఓకే చెప్పాడు. సినిమా ఆరంభం నుండి చివరి వరకు రాజమౌళి పాత్ర కనిపిస్తుందని, డాక్టర్‌గా రాజమౌళి కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. జక్కన్న తన సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం ఉంది. ఆ కారణంగానే సరదాగా తన శిష్యుడి కోరిక మేరకు ఇలా నటించేందుకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.