దర్శకధీరుడు రాజమౌళి ఏకైక పుత్రుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈయన పలు చిత్రాలకు తండ్రితో పాటు వర్క్ చేయడం జరిగింది. ఇక సినిమా ప్రమోషన్ వీడియోలు మరియు ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేసే బిజినెస్‌ను కూడా కార్తికేయ చేస్తున్నాడు. దర్శకత్వంపై ఆసక్తిలేదన్న కార్తికేయ బిజినెస్ చేస్తానంటూ గతంలో చెప్పిన విషయం తెల్సిందే. తాజాగా కార్తికేయ వివాహ నిశ్చితార్థం జరిగింది. గత కొన్నాళ్లుగా కార్తికేయ మరియు పూజా ప్రసాద్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, నిన్న వివాహ నిశ్చితార్థం జరగడం చకచక జరిగింది.
వివాహ నిశ్చితార్థంలో కార్తికేయ స్నేహితులు మరియు పలువురు సినీ తారలు సందడి చేయడం జరిగింది. సింపుల్‌గా జరిగిన వివాహ నిశ్చితార్థ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందరు ఆప్తులు మాత్రమే కనిపించారు. వీరి వివాహంను డిసెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇక కార్తికేయ వివాహం చేసుకోబోతున్న పూజా ప్రసాద్ ప్రముఖ నిర్మాత రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు కూతురు. అంటే హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు జగపతిబాబు అన్న కూతురు అన్నమాట. సింగర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరున్న పూజా ప్రసాద్ కేవలం భక్తి పాటలను మాత్రమే పాడుతుందని తెలుస్తోంది. మొత్తానికి కార్తికేయ ఒక ఇంటివాడు అవుతున్న కారణంగా కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.