టాలీవుడ్ జక్కన్న ఏ సినిమా చేసినా కూడా ఒక పట్టాన ముగించడు అనే విషయం తెల్సిందే. దాదాపు సంవత్సరం అయినా జక్కన్న సినిమాను చేస్తాడు. అందుకే జక్కన్న మూవీ విడుదలకు చాలా ఆలస్యం అవుతూనే ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌తో రాజమౌళి ఒక మల్టీస్టారర్ మూవీని ప్రారంభించడం జరిగింది. ఆ మూవీ తాజాగా పట్టాలెక్కింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్‌లో ప్రారంభించబోతున్నారు. కోకా పేటలో వేసిన సెట్‌లో చిత్రానికి సంబంధించిన మెజార్టీ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అక్కడే రాజమౌళి మకాం కూడా మార్చినట్లుగా సమాచారం అందుతుంది.
రాజమౌళి చాలా కాలం పాటు అక్కడే ఉండాలి కనుక కోకా పేట్‌లో ఈ చిత్రం కోసం వేసిన సెట్టింగ్‌లో చాలా ఖరీదుతో ఒక ఇల్లును నిర్మించారు. పూర్తి పల్లెటూరు వాతావరణం ఉండేలా అక్కడ ఇల్లు నిర్మించడంతో పాటు, హై టెక్నాలజీ వాడి ఇల్లుకు హంగులు అద్దడం జరిగిందట. ఇల్లు బయట నుండి పల్లెటూరు ఇల్లులా అనిపించినా కూడా లోప మాత్రం అత్యాధునిక వసతులు ఉంటాయని తెలుస్తోంది. సెట్టింగ్ ఉన్నంత కాలం ఆ ఇల్లు ఉంటుంది. ఆ తర్వాత తొలగిస్తారు. గతంలో జక్కన్న కోసం బాహుబలి నిర్మాతలు రామోజీ ఫిల్మ్ సిటీలో వసతి ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానయ్య జక్కన్న కోసం ప్రత్యేకమైన ఇల్లును కట్టించాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించాలని భావించారు. ఇప్పుడు 300 కోట్లకు బడ్జెట్ పెరుగుతుందని తెలుస్తోంది.