తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా థియేటర్లను రి ఓపెన్ చేసేందుకు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ, థియేటర్ల వద్ద శానిటైజర్ లను తప్పనిసరిగా ఉపయోగించాలనీ, ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం కి గానూ తెలుగు సినీ దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ కాస్త రిలీఫ్ పొందినట్లు అయింది సీఎం కేసీఆర్ నిర్ణయం తో అని తెలిపారు. మళ్ళీ మనం యధాస్థితికి వచ్చే విధంగా ఉండేందుకు సహాయపడుతుంది అంటూ రాజమౌళి తెలిపారు. కృతజ్ఞతలు సీఎం కేసీఆర్ అంటూ రాజమౌళి తెలిపారు. లాక్ డౌన్ కారణం గా వాయిదా పడిన సినిమా షూటింగ్ లో ఇప్పటికే ప్రారంభం కాగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తో థియేటర్లు తెరుచుకొనున్నాయి.