బర్త్‌డే రోజు నిరాశ పర్చిన రాజమౌళి

rajamouli upset the birthday party to hurt the fans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ స్థాయిని ‘బాహుబలి’తో హాలీవుడ్‌ స్థాయికి తీసుకు వెళ్లి బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సైతం నిర్ఘాంత పోయేలా చేసిన టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తాజాగా ప్రేక్షకులను మరియు తన అభిమానులను నిరాశ పర్చాడు. ‘బాహుబలి 2’ చిత్రం విడుదలై దాదాపు అర్ధ సంవత్సరం కావస్తుంది. అయినా ఇప్పటి వరకు జక్కన్న తర్వాత సినిమా ఏంటి, ఎవరితో, ఎలా ఉండబోతుంది అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో త్వరలో అంటూ అప్పటి నుండి కూడా చెబుతూ వస్తున్నాడు. నిన్న ఆయన పుట్టిన రోజు. ఆ సందర్బంగా జక్కన్న ఏదో ఒక ప్రకటన చేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

రాజమౌళితో సినిమా నిర్మించబోతున్న దానయ్య ఒక పత్రిక ప్రకటనలో రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి, తర్వాత సినిమా గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అందరు ఊహించినది ఏదీ జరగలేదు. రాజమౌళి బర్త్‌డే సందర్బంగా అసలు సినిమా ఊసేలేదు. రాజమౌళి ఎప్పుడు చేసే ప్రకటన త్వరలో అని కూడా చేయలేదు. వచ్చే సంవత్సరం ఆరంభంలో సినిమా ప్రారంభం అవుతుందని కొందరు చెబుతున్నా, రాజమౌళి మాత్రం ఇప్పటి వరకు ఆ విషయాన్ని కూడా నిర్థారించలేదు. రాజమౌళి ప్రస్తుతం ఒక హీరో కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ హీరో జక్కన్నకు డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

రాజమౌళి తర్వాత సినిమా రామ్‌ చరణ్‌తో ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం చరణ్‌ చేస్తున్న ‘రంగస్థలం’ చిత్రం పూర్తి అయిన తర్వాత రాజమౌళి తన సినిమాను ప్రకటిస్తాడేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరు పలు సందర్బాల్లో కలిసి చర్చించడం జరిగిందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఏ విషయం అయ్యింది రాజమౌళి ఒక ప్రకటన చేస్తే బాగుండేది అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.