కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిన తర్వాత తెరుచుకున్న థియేటర్స్ లో చిన్న సినిమాలు సందడి చేశాయి. సెకండ్ వేవ్ కంట్రోల్ అయిన తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన మాస్ మూవీస్ ఇంప్రెస్ చేసాయి. దసరా పండగ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ పరుగులు పెట్టింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, అఖండ, పుష్ప, బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ తగ్గిన తర్వాత మాత్రం ఆ ఛాన్స్ పాన్ ఇండియా మూవీస్ తీసుకోబోతున్నాయట.
మార్చితో ఒమిక్రాన్ కంట్రోల్ అవుతుందని, థర్డ్ వేవ్ కూడా తగ్గుముఖం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే మార్చి మూడో వారం లేదా చివరి వారంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రాధేశ్యామ్ రెడీ అవుతున్నాడు. అన్ని కుదిరితే మార్చి 18న వస్తానంటున్నాడు. అయితే ఇప్పుడు రాధేశ్యామ్‌కు పోటీగా ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అందరూ ఊహించినట్లే ఈ మూవీని ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల కానుంది.ఈ మేరకు తాజాగా చిత్రబృందం అధికారికంగా ఓ నోట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట, ఆచార్య వస్తుండటంతో అంతకంటే ముందే అంటే మార్చి 18న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. అదే నిజమైతే ప్రభాస్ వర్సెస్ రాజమౌళి బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారుతుంది.