స్క్రిప్ట్‌ లాక్‌.. ఆరు నెలలు ఏం చేస్తారు?

Rajamouli's upcoming film with Ram Charan and Jr NTR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజమౌళి ఏ చిత్రం చేసినా పర్‌ఫెక్ట్‌గా చేస్తాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏకంగా అయిదు సంవత్సరాలు తీసుకున్నాడు. అంతుకు ముందు ‘ఈగ’ చిత్రానికి కూడా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రానికి సిద్దం అవుతున్నాడు. తారక్‌, చరణ్‌ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కథను సిద్దం చేశాడు. తాజాగా పూర్తి స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. సహజంగా అయితే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవ్వగానే సినిమా మొదలు పెడతారు. కాని జక్కన్న రూటే సపరేటు కదా, అందుకే చాలా సమయం తీసుకుంటున్నాడు.

స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయినా కూడా షూటింగ్‌ ప్రారంభంకు ఇంకా అయిదు నుండి ఆరు నెలల సమయం ఉంది. ఈగ్యాప్‌లో జక్కన్న ఏం చేయబోతున్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. చరణ్‌ మరియు తారక్‌లు వేరు వేరు చిత్రాలతో కమిట్‌ అయ్యి ఉండటంతో వారి డేట్లు ఇప్పట్లో లేని కారణంగా ఆలస్యంగా చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. అదో కారణం కాగా, ఈ ఆరు నెలల కాలంలో లొకేషన్స్‌ వేట మరియు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌, నటినటుల ఎంపిక కార్యక్రమం ఉంటుందని సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ ఆరు నెలల్లో జక్కన్న మొత్తం కూడా మల్టీస్టారర్‌ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేయనున్నాడు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో చిత్రం షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే సంవత్సరం దసరాకు విడుదల చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.