జీవితం అయిపోయింది

జీవితం అయిపోయింది

‘‘కరోనా నుంచి కోలుకున్నాక ‘శేఖర్‌’ చిత్రం చేశాను. 10 సినిమాల కష్టం ఒక్క ‘శేఖర్‌’కి పడ్డాను. యూనిట్‌ అంతా ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం జీవిత’’ అని రాజశేఖర్‌ అన్నారు. రాజశేఖర్‌ పుట్టినరోజు  వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ‘శేఖర్‌’ చిత్రంలోని ‘కిన్నెర..’ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్‌ డైరెక్టర్‌.

వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘కోవిడ్‌ సమయంలో నా జీవితం అయిపోయింది.. నేను సినిమాలు చేస్తానా? లేదా? అనుకున్నాను. అయితే మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఈరోజు మీ ముందు ఉన్నాను’’ అన్నారు. జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ–‘‘శేఖర్‌’ మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.