‘2.0’ గురించి రెండు షాకింగ్‌ విషయాలు

Rajinikanth 2.0 movie audio released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘రోబో’ చిత్రం తర్వాత రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో మళ్లీ అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘2.0’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. సినిమా ఆడియోను తాజాగా దుబాయిలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. ఏఆర్‌ రహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్ణణ అవుతుందని అంతా భావించారు. ‘రోబో’ సినిమాకు రహమాన్‌ అందించిన సంగీతం ప్లస్‌ అయ్యింది. అందులోని ప్రతి పాట కూడా అద్బుతంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాలోని పాటలపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని అందరి అంచనాలు తల క్రిందులు చేశారు.

‘2.0’ చిత్రంలో కేవల ఒక్క పాట మాత్రమే ఉండబోతుందని తేలిపోయింది. మొత్తం మూడు పాటలు రహమాన్‌ ట్యూన్‌ చేయగా, రెండు పాటలను ఆడియో విడుదల వేదికపై పాడేశాడు. ఇక మిగిలిన పాట సినిమాలో చూస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు తేల్చి చెప్పారు. సినిమా కథకు, స్క్రీన్‌ప్లేకు పాటలు అడ్డు అవుతాయనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా దర్శకుడు శంకర్‌ చెబుతున్నారు. రహమాన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రేక్షకులను మరోలోకానికి తీసుకు వెళ్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

ఒకే ఒక్క పాట ఉండటం ఒక షాకింగ్‌ విషయం అయితే, ‘2.0’ చిత్రం ఆడియో విడుదల కోసం లైకా ప్రొడక్షన్స్‌ ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెల్సిస్తే అంతకు మించి షాక్‌ అవుతారు. దుబాయిలో భారీ ఎత్తున ఈ ఆడియోను విడుదల చేసేందుకు లైకా వారు ఏకంగా 50 కోట్లను ఖర్చు చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకు కూడా ఇంత భారీ స్థాయిలో ఆడియో వేడుక జరగలేదు. ఒక తెలుగు భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కించాలంటే 50 కోట్లు కావాల్సిందే. కాని ఆడియో విడుదలకు మాత్రమే శంకర్‌ 50 కోట్లు ఖర్చు చేసి తాను తెరకెక్కించిన ‘2.0’ చిత్రం స్థాయి ఏంటో చెప్పకనే చెప్పాడు.