అర్జున్‌రెడ్డి ఆ తప్పు ఎందుకు చేస్తున్నావ్‌..?

vijay devarakonda next movie with Kranthi madhav

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఈయనకు ‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌డం వచ్చింది. ఆ సినిమా తర్వాత ఒకటి రెండు చిన్న చితకా సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులు గుర్తించలేదు. తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో విజయ్‌కు సంచలన బ్లాక్‌ బస్టర్‌ దక్కింది. ప్రస్తుతం యువ స్టార్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒక్కడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ చేయబోతున్న సినిమాల గురించి, చేస్తున్న సినిమాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కమర్షియల్‌ సినిమాలు చేసి తనకు వచ్చిన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాల్సిన విజయ్‌ దేవరకొండ అనవసర ప్రయత్నాలు చేస్తున్నాడు.

యువ హీరోలు ఇమేజ్‌ బిల్డ్‌ అవుతున్న సమయంలో ప్రయోగాత్మక సినిమాలు తెలుగులో ఏ ఒక్కరు చేసింది లేదు. ఒక వేళ చేసినా కూడా ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్‌గా నిుస్తుంది, నిలిచింది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ చేయబోతున్న సినిమా కూడా ఫ్లాప్‌ జాబితాలోకి వెళ్లి పోతుందని ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్‌ తాజాగా కమిట్‌ అయిన సినిమా ప్రయోగాత్మక చిత్రం. అవును విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ చిత్రం చేయబోతున్నాడు.

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే చిత్రాన్ని చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రాంతి మాధవ్‌ ప్రేక్షకుల నుండి కలెక్షన్స్‌ను మాత్రం రాబట్టలేక పోయాడు. తాజాగా ‘ఉంగరాల రాంబాబు’ అనే కమర్షియల్‌ చిత్రాన్ని దర్శకుడు ప్లాన్‌ చేశాడు. కాని ఆ సినిమా రెండు విధాలుగా విఫలం అయ్యింది. అందుకే ఈసారి తన మార్క్‌ చిత్రాన్ని చేయాలని క్రాంతి మాధవ్‌ ఒక మంచి ఫీల్‌గుడ్‌ ప్రయోగాత్మక కథను ఎంచుకున్నాడు. ఆ కథకు విజయ్‌ దేవరకొండ ఓకే చెప్పడం జరిగింది. వీరిద్దరి కాంబో మూవీ త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం గీతాఆర్ట్‌ బ్యానర్‌లో ఒక చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడు. ఆ తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.