సూపర్ స్టార్ రజినీకాంత్ మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో రాబోతోన్న అన్నాత్తె సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. తలా అజిత్‌తో వరుసగా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్లను కొట్టిన శివ.. ఇప్పుడు రజినీతో మాస్‌ను వేరే లెవెల్లో చూపించేందుకు రెడీ అయ్యారు. రజినీ అన్నాత్తె చిత్రంలో భారీ తారాగణం ఉందన్న సంగతి తెలిసిందే. మీనా, కుష్బూ, కీర్తి సురేష్ ఇలా చాలా మందితో శివ దుమ్ములేపేందుకు రెడీ అయ్యారు.
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాకు కరోనా దెబ్బ పడింది.షూటింగ్‌లకు కరోనా అంతరాయం కలిగిస్తుండటంతో వాయిదాలు పడుతూనే వస్తోంది. అయితే తాజాగా నేడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా అన్నాత్తె నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా వదిలిన ఈ పోస్టర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పంచెకట్టులో రజినీ స్టైల్, ఆ మార్క్‌ను మరోసారి చూపించారు.
ఆ స్టైల్, నడక, నిల్చునే తీరు, నవ్వే విధానం అన్నీ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలానే ఉంది. మొత్తానికి ఇప్పుడు ఫస్ట్ లుక్ హల్చల్ చేస్తోంది. ఇక సాయంత్రం మోషన్ పోస్టర్ రచ్చ చేయనుంది. అన్నాత్తె సినిమా ఈ దీపావళికి థియేటర్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగి, పరిస్థితులు బాగానే ఉంటే ఈ ఏడాది బాక్సాఫీస్ మీద అన్నాత్తె దాడి చేస్తాడు. ఈ ఫస్ట్ లుక్ మీద టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇందులో రజినీ పక్కన నయనతార కనిపించబోతోంది.