Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి అభిమానుల ఉత్సాహం మీద నీళ్లు చల్లుతూ రాజకీయాల్లోకి ఇప్పట్లో రానని చెప్పారు. కొత్త సినిమా విడుదల తర్వాత అభిమానులతో ఇంకోసారి సమావేశం అవుతానని చెప్పారు. అయినా ఈసారి రజనీ అభిమానుల నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదు. మీరు రాజకీయాల్లోకి రాకుంటే కుదరదని చెప్పలేదు. బాగా అలవాటైన విషయంలా, ముందే ఊహించిన పరిణామంలా రియాక్ట్ అయ్యారు. దీంతో రజనీ కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఊరించి ఊరించి రజనీ ఈ నిర్ణయం తీసుకోడానికి భయమే కారణం అని తెలుస్తోంది.
జయ మరణం తర్వాత రజనీ ని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని బీజేపీ తహతహలాడింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం ను గద్దె ఎక్కించాలని కోరుకుంది. ఆ రెండు పనులు కాకపోవడంతో పళనిస్వామి ప్రభుత్వాన్ని కట్టడి చేయబోయింది. మొత్తంగా అన్నాడీఎంకే లో గొడవలతో ప్రయోజనం లేదనుకుని డీఎంకే తో పొత్తు కోసం ప్రధాని మోడీ నేరుగా వెళ్లి కరుణానిధిని తన ఢిల్లీ నివాసంలో విశ్రాంతి తీసుకోమని చెప్పేదాకా వెళ్ళింది. ఒక ఏడాది కాలంలో బీజేపీ ఇన్ని రంగులు మార్చడం రజనీని కంగారు పెట్టిందట. ఇక కేంద్రం తమిళుల మనోభావాలను లెక్కచేయకపోవడం కూడా రజనీని ఆలోచనలో పడేసింది. తనను దేవుడిలా ఆరాధించినవాళ్ళే రాజకీయాల మాట ఎత్తగానే తమిళుడు కాదన్న వాదన ముందుకు తేవడం అదే పాయింట్ మీద కమల్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టడం చూసి కూడా రజనీ షాక్ అయ్యారంట. ఇంత అవకాశవాద ధోరణిలో తాను వ్యవహరించలేనని ఆయనకు బాగా తెలుసు. అందుకే సైలెంట్ కావాలని డిసైడ్ అయ్యారంట. రాజకీయంగా అస్థిర పరిణామాలతో వున్న తమిళనాడులో తాను సినిమాకే పరిమితం అయితే బెటర్ అని నిర్ణయించుకున్న రజనీ పొలిటికల్ రోల్ లో ఫెయిల్యూర్ కి భయపడ్డారు. ఓటమిని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారికే గెలుపు సొంతం అవుతుంది. అందుకు రజనీ మినహాయింపు కాదు.