Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈమద్య నటించిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ ముందు అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రజినీకాంత్ ‘కాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈవయస్సులో చాలా కష్టపడి రజినీకాంత్ ఆ చిత్రాన్ని చేశాడు. కాని ఆ సినిమా రజినీకాంత్ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా చేసింది. ఏమాత్రం ఆకట్టుకోని విధంగా ఆ చిత్రంను దర్శకుడు రంజిత్ పా తెరకెక్కించాడు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత రజినీకాంత్ సినిమాల ఎంపిక విషయంలో అస్సలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో రజినీకాంత్ సినిమాల నుండి తప్పుకోవాలని కొందరు ఫ్యాన్స్ మరియు సన్నిహితులు అంటున్నారు. ఈ విషయంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతున్నప్పటికి తాజాగా ఆయన కూతురు వ్యాఖ్యలు చేయడంతో మరోసారి చర్చనీయాంశం అవుతుంది.
తాజాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య మాట్లాడుతూ… నాన్న సినిమాలకు మెల్ల మెల్లగా దూరం కావాలని మేం కోరుకుంటున్నాం. కాని ఆయన మాత్రం సినిమాలు చేయానే పట్టుదలతో ఉన్నారు. ఆయన ఆరోగ్య రీత్య సినిమాలు చేయద్దని డాక్టర్లు సూచిస్తున్నా కూడా ఆయన మాత్రం వినడం లేదు అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ఈ సమయంలో నాన్న సినిమాల కంటే కుటుంబంకు ఎక్కువగా సమయం కేటాయిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఆమె వ్యక్తం చేసింది. రజినీకాంత్ ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. అందులో ఒకటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.0’ కాగా రెండవది త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న కార్తీక్ సుబ్బరాజు చిత్రం. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత రజినీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని కుటుబం నుండి ఒత్తిడి వస్తుంది. మరి సూపర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. మరోవైపు రాజకీయాలతో కూడా రజినీకాంత్ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజకీయాల్లో సక్సెస్ అయితే రజినీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పడం ఖాయం.