తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి నేడు ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. అలాగే రజినీకి ఇండియా తో పాటుగా ప్రపంచ దేశాలలో అభిమానులు అభిమాన సంఘాలు ఉన్నాయి. రజిని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైతే ఉండే ఆ హడావిడే వేరు. సినిమా హిట్ ప్లాప్ అన్న తేడా లేకుండా కలెక్షన్స్ ని కుమ్మేస్తాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటడం నేర్చుకోవాలి అనే మాటలు రజిని ని చూసే ఎవరైనా చెప్పారా అనుకునేలా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు.
గత కొన్ని రోజులుగా రజిని పార్టీ పెట్టి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ రజిని వచ్చే ఎన్నికలలోపు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే వార్తలు వినిపిస్తుండం తో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు లో పట్టు చూపించడానికి అప్పుడే పావులు కదుపుతోందా అని అనిపించకమానదు. ఎందుకు అంటే ఈ మద్యే రజినీకి కేంద్రం ఐకాన్ సిల్వర్ జూబ్లీ పురస్కారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై సినీ వర్గాలలో ఆనందం కలుగుతున్న రాజకీయ వర్గాలలో మాత్రం సరికొత్త చర్చ నడుస్తుంది.
ఎలాగైనా రజనీని బీజేపీలో చేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయనను మెప్పించే విధంగా కేంద్రప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో రాణించగలుగుతున్న బీజేపీ తమిళనాట కాలుమోపలేని పరిస్థితి ఉంది. ఆ తరుణం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ.. ఇప్పుడు రజనీకాంత్ మద్దతుతో తమిళనాడు లో కాలుమోపాలని చూస్తుంది. దీనితో ఐకాన్ రాజకీయం మొదలు పెట్టింది అంటూ మాట్లాడుకుంటున్నారు. బీజేపీ నిర్ణయాలకు రజనీ ఏకీభవిస్తుండడంతో కాషాయ పార్టీలో రజనీ చేరికపై ఊహాగానాలు మొదలయ్యాయి.
రాజకీయాల్లో నా దారి రహదారేనని చెబుతున్న రజినీని పార్టీలో చేర్చుకోకపోయినా తమ పార్టీ ఏర్పాటు చేయబోతున్న కూటమిలోనైనా చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు ప్లాన్ వేస్తున్నారంట. దీనికోసమే ఆయనకు కేంద్రప్రభుత్వం ఐకాన్ సిల్వర్ జూబ్లీ పురస్కారాన్ని ప్రకటించిందని అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సివుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం రజిని దర్బార్ సినిమాలో నటిస్తున్నాడు.