సూపర్ స్టార్ రజినీకాంత్, రంజిత్‌పాల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కబాలి’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమాను బుల్లి తెరపై ప్రేక్షకులు బాగా ఆధరించారు. కబాలి ఫ్లాప్ అయినా కూడా దర్శకుడు రంజిత్‌పాపై ఉన్న నమ్మకంతో మరో సినిమాను చేసే అవకాశం ఇచ్చాడు. మళ్లీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమాను రంజిత్ తెరకెక్కించాడు. రజినీకాంత్‌తో ‘కాలా’ చిత్రాన్ని చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకోవాలని రంజిత్ ఆశించాడు. మామతో సినిమాను నిర్మించి లాభాలను దండుకోవాలని ధనుష్ స్వయంగా ‘కాలా’ చిత్రాన్ని నిర్మించాడు. అయితే సినిమా ఫలితం తారుమారు అయ్యింది. అనుకున్నది ఒక్కటి, అయినది మరొక్కటి అంటూ చాలా నిరాశగా ‘కాలా’ మిగిలింది. తమిళనాడులో కాస్త పర్వాలేదు అనిపించినా హిందీ మరియు తెలుగులో అట్టర్ ఫ్లాప్‌లకు బాప్ అన్నట్లుగా నిలిచింది.
అంతటి ఫ్లాప్ అయినా కూడా ఈ చిత్రాన్ని సన్ నెట్‌వర్క్ సంస్థ ఏకంగా 61.5 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకుంది. అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ధనుష్ నుండి సన్ నెట్‌వర్క్ సంస్థ కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్‌తోనే 100 కోట్లు దక్కించుకోవాలని భావించిన ధనుష్‌కు కాస్త నిరాశే అయినప్పటికి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇంతగా రేటు పలకడం రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఇంతటి సంచలన రేటు పలికిన ‘కాలా’ చిత్రం ప్రస్తుతం బుల్లి తెర ప్రీమియర్‌కు సిద్దం అవుతుంది. జులై రెండవ లేదా మూడవ వారంలో తెలుగు మరియు తమిళంలో ఒకేసారి వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా గురించి ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే టీవీలో వస్తే భారీగా టీఆర్‌పీ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సన్ నెట్వర్క్ పదే పదే ఇకపై ఈ చిత్రాన్ని వేసే అవకాశం ఉంది. ‘కబాలి’ చిత్రానికి బుల్లి తెరపై మంచి ఆధరణ ఉన్నట్లుగానే ‘కాలా’ను కూడా బుల్లి తెర ప్రేక్షులు ఆధరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.