సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నత్తె. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ని విక్టరీ వెంకటేశ్ విడుదల చేశాడు. రజనీకాంత్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతంది. రజనీకాంత్ లుక్స్, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘పల్లెటూరోడు కోప్పడితే.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.