Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రిలీజయ్యాక రికార్డ్స్ ను మామూలు స్టార్స్ క్రియేట్ చేస్తారు. అయితే రజనీకాంత్ సినిమాలు మాత్రం విడుదల కాకముందే కొత్త కొత్త రికార్డులు చేస్తారు ఇది ఆయన అభిమానులు చెప్పుకునే మాట వినడానికి అతిశయోక్తిలా ఉన్నా దాదాపు వాస్తవమే. కానీ ఆయన మునుపటి విడుదల చిత్రం కబాలి` ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. వస్తుంది వచ్చి రికార్డ్స్ బద్దలుకొడుతుంది అనుకున్న రోబో 2 వెనకెనక్కి వెళ్తోంది. అందుకే `కాలా` మీద రజనీ బాగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈనెల 7న కాలా విడుదల కానుంది. రజనీ సినిమా అంటే… తెలుగులోనూ విపరీతమైన క్రేజ్. తమిళ సినిమా వసూళ్లని మించి తెలుగులో బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించిన సినిమాలెన్నో.
రజనీ సినిమా వస్తోందంటే ఆఫీస్ లకు సెలవు ఇస్తారు అంటే తలైవా కెపాసిటీ ఏంటో పెద్దగా వివరించ్క్కర్లేదు. కాబాలి డైరెక్టర్ ఏ మళ్ళీ కాలా కూడా డైరెక్ట్ చేస్తున్నాడు దీంతో ఈ ప్రాజెక్ట్ కి అంతగా క్రేజ్ లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా.. `కాలా` సినిమాని తెలుగులో బాగానే ప్రమోట్ చేసుకున్నాడు రజనీ. `కాలా`కి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. దిల్ రాజు, ఏఎం రత్నంలాంటి వాళ్ళు ఎందరు మాట్లాడినా రజనీ స్పీచ్ కోసమే జనాలు ఎదురు చూస్తారు కదా? రజనీ కూడా తెలుగు ఆడియన్స్ హార్ట్స్ కొల్లగొట్టడానికి అన్నట్టు బాగా ప్రిపేర్డ్‌గానే ఈ ఫంక్షన్‌కి వచ్చినట్టున్నాడు. తెలుగు సెంటిమెంట్ దట్టించి ఇక్కడి ప్రేక్షకుల్ని, అభిమానుల్నీ సెంటిమెంటుతో కొట్టావురా అనిపించాడు.
తనపై తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, తెలుగు వారూ అంతే ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఒకానొక సమయంలో తనకు ఎక్కడ కొనసాగాలన్న సందేహం వచ్చిందని, అయితే, బాలచందర్ సినిమాతో తన కెరీర్ అక్కడే ప్రారంభం కావడంతో తమిళంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయినా తెలుగులో తనకు ‘పెదరాయుడు’తో బ్రేక్ వచ్చిందన్నారు. ఆ తర్వాతి నుంచి తన సినిమాలన్నీ ఇక్కడ విడుదలయ్యాయని పేర్కొన్నారు. తన భాషా, ముత్తు, నరసింహా, చంద్రముఖి చిత్రాలకు భారీ వసూళ్లు దక్కాయని తమిళంలోలానే తెలుగులోనూ తన సినిమాల్ని బాగా ఆదరిస్తున్నారని గుర్తు చేశాడు రజనీ.
హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ఎన్టీఆర్‌ని కలిసేవాడ్ని అని, దాసరి లేని లోటు తెలుస్తుందని ఆ లెజెండ్స్‌ని గుర్తు చేసి సెంటిమెంట్ టచ్ ఇచ్చాడు. ఇక ‘ఒకే రజనీకాంత్’ అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలపై రజనీ స్పందిస్తూ ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుందని, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా ఎవరికి వారేనని, ఎవరి ప్రాముఖ్యం వారిదని స్పష్టం చేశారు. ‘కబాలి’ చేసినప్పుడు ఇంత చిన్న దర్శకుడితో చేస్తున్నారేంటి? అని అనుకున్నారని, కథ నచ్చడం, మంచి సందేశం ఉండడంతో ఆ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, కమర్షియల్‌గా మాత్రం అది హిట్ కాలేదన్నారు. ముంబై మురికివాడల నేపథ్యంలో తీసిన ‘కాలా’ సినిమాలోని ఐదారు పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమయినా తెలుగువారు సెంటిమెంట్ ని బాగా ఫాలో అవుతారని చెప్పినాట్టున్నారు ఎవరో రజనీకి. ఈ సినిమా ఏమి చేస్తుందో తెలియాలి అంటే ఇంకోద్దిరోజులు వేచి చూడల తప్పదు.