Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన బాహుబలిని వెనక్కినెట్టి మరీ మనదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ కు ఎంపికయిన న్యూటన్ కు నిరాశ ఎదురయింది. విదేశీ చిత్రాల కేటగిరీలో న్యూటన్ ఆస్కార్ నామినేషన్ కు అర్హత సాధించలేకపోయింది. ఈ విభాగంలో వివిధ దేశాల నుంచి 92 చిత్రాలు పోటీపడగా… తొమ్మిది చిత్రాలు నామినేషన్ కు అర్హత పొందాయి. న్యూటన్ కు ఆ జాబితాలో చోటుదక్కలేదని ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. ఎన్నికల కథాంశం నేపథ్యంగా వచ్చిన న్యూటన్ కు అమిత్. వి. మసుర్కర్ దర్శకత్వం వహించారు.
రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్న కథాంశం కావడంతో న్యూటన్ కు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కించుకుంది కానీ ఆస్కార్ బరిలో నిలవలేకపోయింది. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమాకూ ప్రతిష్టాత్మక ఆస్కార్ దక్కలేదు. లగాన్, మదర్ ఇండియా, సలామ్ బాంబే చిత్రాలు మాత్రం ఫైనల్ వరకు చేరుకున్నాయి కానీ ఆస్కార్ అందుకోలేకపోయాయి.