కరోనా బారిన పడ్డ రాజ్‌నాథ్‌ సింగ్‌

కరోనా బారిన పడ్డ రాజ్‌నాథ్‌ సింగ్‌

దేశంలో కరోనా వైరస్‌ దాడి మళ్లీ మొదలైంది. రోజువారీ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధుల వరకు అందరూ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, స్వల్వ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు.