రజనీకాంత్‌ కూడా రెడీ

రజనీకాంత్‌ కూడా రెడీ

మెల్లిగా ఒక్కో సినిమా షూటింగ్‌లు స్టార్ట్‌ అవుతున్నాయి. రజనీకాంత్‌ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించడానికి రెడీ అయ్యారని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’’. మీనా, కుష్బూ, కీర్తీ సురేష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం హైదరాబాద్‌ లో ప్లాన్‌ చేశారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో ఎక్కువ షూటింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదని, చాలా రిస్క్‌ తో కూడుకున్నదని భావించిన చిత్రబృందం చెన్నైలోనే ఓ భారీ సెట్‌ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలన్నది ప్లాన్‌ . త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సన్‌ పిక్చర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.