టాలీవుడ్ సినీతారలు వరుసగా మాల్దీవుల బాట పట్టారు. కాజల్ అగర్వాల్ ఇటీవల భర్త గౌతమ్‌తో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తాజాగా రకుల్‌ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో సింగిల్‌గా వాలిపోయింది. అక్కడ సముద్రపు ఒడ్డున చల్లటి గాలి ఆస్వాదిస్తూ బికినీలో రచ్చ చేస్తోంది.
ఇటీవల సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో రకుల్ తనలోని గ్లామర్‌ను బయటపెట్టేందుకు ఈ ఫోటో వదిలినట్లుగా అనిపిస్తోంది. సముద్రపు ఒడ్డున రిసార్టులో బికినీలో సేద తీరుతున్న ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫిట్‌నెస్‌లోకు అధిక ప్రాధాన్యమిచ్చే రకుల్ గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గేది లేదని ఈ పిక్‌తో స్పష్టం చేసింది. బాలీవుడ్ హీరోయిన్ల కంటే ఎందులోనూ తాను తక్కువ కాదన్న రీతిలో ఫోటోకు ఫోజులిచ్చింది. ‘స్మెల్ ది సీ… ఫీల్ ది స్కై… లెట్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ ఫ్లై’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.