బయోపిక్‌ లో రకుల్‌ ప్రీత్‌

బయోపిక్‌ లో రకుల్‌ ప్రీత్‌

ప్రస్తుతం బయోపిక్‌ ట్రెండు నడుస్తోంది. పలువురు ప్రముఖుల బయోపిక్‌లతో పొందిన చిత్రాలు ప్రజాదరణ పొందుతున్నాయి. జయలలిత జీవిత చరిత్రతో తలైవీ, ది ఐరన్‌ లేడీ చిత్రాలు నిర్మాణాల్లో ఉన్నాయి. త్వరలో మరో ప్రముఖ క్రీడాకారిణి జీవిత చరిత్ర సినిమాగా రూపొందబోతోంది. వెయిట్‌ లిఫ్ట్‌లో ప్రపంచ స్థాయిలో కాంస్యం పథకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందనుందని సమాచారం.

కాగా ఈ చిత్రంలో కరణం మల్లేశ్వరి పాత్రలో అందాల నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇండియన్‌– 2 చిత్రంలో కమల్‌ హాసన్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మినహా ఈ అమ్మడికి మరో అవకాశం లేదు. ఇలాంటి సమయంలో కరణం మల్లేశ్వరి బయోపిక్‌లో ఎంపిక అయితే ఈ అమ్మడు కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరని చెప్పవచ్చు. కాగా ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.