గ్రామీణ యువతి పాత్రలో రకుల్‌

గ్రామీణ యువతి పాత్రలో రకుల్‌

క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌-వైష్ణవ్‌తేజ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కొండపొలం. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోషన్‌ పోస్టర్‌తో పాటు రకుల్‌ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. కొండపాలెం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.