Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాయి పల్లవి… ఇప్పుడు ఈ అమ్మడుకి క్రేజ్ మాములుగా లేదు… యువ హీరో లు అందరు ఈ అమ్మడుతో నటించటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మలయాళం ‘ప్రేమమ్’ యువతను ఆకట్టుకున్న ఈ అమ్మడు తెలుగులో ఒక్క ఫిదా సినిమాతోనే టాప్ రేంజ్ లోకి దూసుకుపోయింది. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా మంచి ఆఫర్స్ ని అందుకుంటోంది. సాయి పల్లవి ఇప్పటికే కోలీవుడ్ లో కణం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చేస్తుండగానే కోలీవుడ్ స్టార్ హీరోతో మరో సినిమా ఛాన్స్ దక్కించుకుంది.
సూర్య హీరోగా 7/G బృందావన కాలిని , ఆడవారిమాటలకు అర్దాలే వేరులే వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ని ఈ అమ్మడు దక్కించుకుంది. ఆల్రెడీ ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమెతో పాటు మరో హీరోయిన్ గా సాయి పల్లవి ని కూడా ఈ సినిమాలోకి తీసుకున్నారు. ఇప్పటికే వీరిద్దరు తెలుగులో హరీష్ శంకర్ మల్టీస్టారర్ లో నటిస్తున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సూర్యతో రొమాన్స్ చేయబోతున్నారు. మరి సూర్య వీళ్ళిద్దరిని మధ్య నలిగిపోకుండా తట్టుకోగలడో లేదో… మొత్తానికి తన అభిమాన నటుడు సూర్య తో నటించే ఛాన్స్ రావటంతో ‘సాయి పల్లవి’ ఆనందానికి అవదలు లేవు…