రకుల్‌ కోసం అప్పుడు చరణ్‌, ఇప్పుడు మహేష్‌…

rakul preet singh as Heroine in Mahesh Vamsi Paidipally movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ క్రేజీ హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కొనసాగుతుంది. గత సంవత్సర కాలంగా ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సినిమాలు సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈమెతో నటించేందుకు స్టార్‌ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి ఈమెతో నటించిన హీరో మరోసారి నటించేందుకు ఆసక్తిగా ఉంటున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో ‘బ్రూస్లీ’ చిత్రంలో రొమాన్స్‌ చేసిన రామ్‌ చరణ్‌ ఆ వెంటనే ‘ధృవ’ చిత్రంలో చాన్స్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. వీరిద్దరి రొమాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రెండు సినిమాల్లో కూడా ఇద్దరి జంట బాగుందనే టాక్‌ వచ్చింది. తాజాగా మరో స్టార్‌ హీరో మహేష్‌బాబు కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను కోరుకుంటున్నాడు.

మహేష్‌బాబు తాజాగా నటించి విడుదలైన చిత్రం ‘స్పైడర్‌’. మురుగదాస్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించంది. బ్రహ్మోత్సవం సినిమాలోనే రకుల్‌కు నటించే అవకాశం వచ్చినా కూడా డేట్స్‌ కుదరక పోవడంతో రకుల్‌ ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కాని వెంటనే స్పైడర్‌ చిత్రంలో నటించే అవకాశం రావడంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సంతోషంకు అవదులు లేవు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు స్పైడర్‌ ఫలితం కాస్త నిరుత్సాహ పర్చింది. కాని తాజాగా మరోసారి మహేష్‌బాబుతో నటించే అవకాశం రావడంతో ఈమె మళ్లీ కూడా ఎగిరి గంతేస్తోంది.

‘స్పైడర్‌’ చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా మహేష్‌బాబు తన తర్వాత రెండు ప్రాజెక్ట్‌ల పనిలో పడ్డాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని మహేష్‌బాబు మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి కాకుండానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను మహేష్‌బాబు చేయబోతున్నాడు. దిల్‌రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లబోతుంది. ఆ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను హీరోయిన్‌గా దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మహేష్‌తో మళ్లీ ఛాన్స్‌ రావడంతో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కెరీర్‌ మరింత ఉన్నత స్థాయికి చేరడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.