రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి కార్డు వైరల్..నిజమేనా..?

రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి కార్డు వైరల్..నిజమేనా..?
Cinema News

హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌పై గత కొంత కాలంగా పెళ్లి వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నానీతో పెళ్లి నిశ్చయం అయింది. వీరిద్దరు ఈ నెల 21న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ మేరకు వీరి వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు. అలాగే కార్డుపై ‘అబ్‌దోనోభగ్నా-ని’అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రింట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న రకుల్, జాకీ తమ వివాహానికి గోవాను ఎంచుకున్నారు. దీనివెనక కూడా ఓ కారణం ఉంది. వారిద్దరూ లవ్‌లో పడింది ఇక్కడేనట. జాకీ 2009లో ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫాల్తు, అజాబ్ గజాబ్ లవ్, రాంగ్రేజ్, యంగిస్థాన్ వంటి సినిమాల్లో నటించాడు.

రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి కార్డు వైరల్..నిజమేనా..?
Rakul Preethi Singh , Jackie Bhagnani

009లోనే కన్నడ సినిమా గిల్లీతో రకుల్ ప్రీత్‌సింగ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో తెలుగులో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత యంగ్ హీరోస్ అందరితో సినిమాలు చేస్తూ.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ధృవ సినిమాలో అవకాశం దక్కించుకుంది. తరువాత కొండపొలం అనే చిన్న సినిమాలో నటించింది. ఇక బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. వరుసగా దేదే ప్యార్ దే, రన్‌వే 34, చాత్రివాలీ, ఐ లవ్‌ యూ, డాక్టర్ జీ వంటి సినిమాల్లో నటించింది. ముందు వీరి విహహం మాల్దీవ్స్‌లో అనుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంతో వీరి డెస్టినేషన్ వెడ్డింగును గోవాకు మార్చుకున్నారు.