తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. బ్యూటీడాల్గా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నరకుల్ ప్రీత్ సింగ్‌కు ఏమైందో ఏమో కానీ, ఇంకా తన అందాన్ని రెట్టింపు చేయాలనుకుందట. అందుకోసం ఆమె తన శరీరంలో ఓ భాగానికి చిన్న మార్పుతో ఆపరేషన్ చేయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ రకుల్ ఏ భాగానికి ఆపరేషన్ చేయించుకుందో తెలుసా? పెదాలు. రీసెంట్గా ఆమె పెదాలు ఉన్న తీరు చూసిన వారు, మార్పు కనపడుతుందని, ఇంకా బెటర్ లుక్ కోసం రకుల్ లిప్స్ ఆపరేషన్ చేయించుకుందని అనుకంఉటున్నారు.
హీరోయిన్స్ అందంగా కనిపించడానికి కృతిమ పద్ధతులను అవలభిస్తుంటారు. కొందరు ముక్కును ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు లిప్స్‌ను మార్పులు చేసుకుంటూ ఉంటారు. లిప్స్ చక్కగా కనపడేలా ఆపరేషన్ చేయించుకునే పద్ధతి పౌట్ అంటారు. బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా ఈ కృత్తిమ విధానాల్లో అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా వారి బాట పట్టిందని అంటున్నారు.
మరి ఈ వార్తలపై ఈ అమ్మడు తన సోషల్ మీడియా ద్వారా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.ఇక సినిమాల విషయానికి వస్తే.. అక్టోబర్‌లో ఈమె వైష్ణవ్ తేజ్‌తో నటించిన కొండపొలం సినిమా విడుదలవుతుంది. అలాగే అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది రకుల్. ఎటాక్, మేడే, థాంక్ గాడ్, డాక్టర్ జీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ లిస్టులో ఓ తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం.