Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో అను ఎమాన్యూల్ స్థాయి పెరిగిపోతుంది. నిన్న మొన్నటి వరకు రకుల్ ప్రీత్‌సింగ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వరుసగా ఆఫర్లు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ స్థానం కోసం పలువురు హీరోయిన్‌లు పోటీ పడుతున్నారు. అందులో అను ఎమాన్యూల్ ఒక హీరోయిన్‌గా చెప్పుకోవచ్చు. అను ఎమాన్యూల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఒక చిత్రాన్ని చేస్తోంది. ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేస్తున్న అను ఎమాన్యూల్‌కు లక్కీగా మరో మెగా ఛాన్స్ దక్కింది.
ప్రస్తుతం రంగస్థలం చిత్రాన్ని చేస్తున్న రామ్ చరణ్ తర్వాత సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. బోయపాటి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్‌కు జోడీగా అను ఎమాన్యూల్ అయితే బాగుంటుందని బోయపాటి భావించడం, అందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాత దానయ్య ఆమెను సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతుంది.
రామ్ చరణ్‌తో సినిమా అనగానే ఏమాత్రం ఆలోచించకుండా అను ఎమాన్యూల్ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి అను ఎమాన్యూల్ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి దూసుకు వెళ్లేందుకు రేసును మొదలు పెట్టింది. ఇటీవలే నాగచైతన్యకు జోడీగా ఒక చిత్రాన్ని ఈమె కమిట్ అయిన విషయం తెల్సిందే. ఈ మూడు మెగా మూవీలు మరియు అను ఎమాన్యూల్ నటిస్తున్న ఇతర చిత్రాలు విడుదల అయితే ఈమె స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం.