సూర్య కోసం చరణ్‌..!

ram-charan-attend-for-naa-peru-surya-pre-release-function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆడియోను తాజాగా మిలటరీ మాధవరంలో విడుదల చేసిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్‌ చరణ్‌ పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న చరణ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. బాబాయి నాగబాబు నిర్మించడంతో పాటు, కజిన్‌ బన్నీ నటించిన సినిమా అవ్వడంతో చరణ్‌ ప్రమోషన్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు.

గత కొంత కాలంగా రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ల మద్య కోల్డ్‌ వార్‌ జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అభిమానులు కూడా విడిపోయి కొన్ని సార్లు విమర్శలు చేసుకున్నారు. అయితే బన్నీ, చరణ్‌లు మాత్రం ఎప్పుడు బాహాటంగా విమర్శించుకోలేదు. ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిరూపించుకునేందుకు ఇలా ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు అవుతూనే ఉంటారు. తాజాగా ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరు అవ్వడం వల్ల ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిరూపించవచ్చని మెగా వర్గాల వారు భావిస్తున్నారు. అందుకే సూర్య కోసం చరణ్‌ రాబోతున్నాడు.