పీఆర్పీ డొనేషన్స్ బయట పెడతారా పవన్ ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగుదేశాన్ని, టీవీ9 శ్రీని రాజుని కలిపి ప్రజల ముందు నిలబెట్టడానికి పాపం పవన్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రెండు రోజులుగా అనేక సంచలన విషయాలు బయట పెడతానంటూ పవన్ వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఆ ట్వీట్లలో ఏబీఎన్ రాధాకృష్ణ, శ్రీని రాజు లని పవన్ టార్గెట్ చేసుకున్నారు. కాని పవన్ ఏవయితే రహస్యాలు అంటూ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాడో అవన్నీ ప్రజలకి తెలిసిన విషయాలే, పైగా ఇప్పటివి కూడా కాదు 2009 లోవి. కొద్ది సేపటి క్రితం తెలుగుదేశం పార్టీ కి శ్రీని రాజు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు ఉన్న ఒక పిక్ ని పవన్ విడుదల చేశాడు.
 
పవన్ పోస్ట్ చేసిన చిత్రం ప్రకారం జుబ్లీ హిల్స్ లో నివాసం ఉండే చలపతి శ్రీనివాస రాజు 2009 ఏప్రిల్ 23న తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు పార్టీ ఫండ్ గా ఇచ్చారు. అయితే పవన్ ఏదయితే పిక్ పోస్ట్ చేసాడో దాని ప్రకరం ఇది చెక్ ద్వారా పే చేయబడిన అమౌంట్ అంటే ఇక్కడ చట్ట విరుద్దంగా అనుమానించాల్సిన విషయం ఏమీ లేదు. అదీ కాక పొలిటికల్ పార్టీలు అన్నింటికీ పారిశ్రామికవేత్తలు తమ శక్తీ కొలది డబ్బు పార్టీ ఫండ్ గా ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. వారు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నా, అన్ని పార్టీలకి సమానంగా ఫండ్ ఇస్తారు పారిశ్రామికవేత్తలు.
 
అయితే ఈ విషయాన్ని పవన్ ఏదో పెద్ద రీసెర్చ్ చేసి కనుక్కున్నట్టు ట్వీట్ చేయడం ఇప్పుడు ఇరుకున పెట్టేలా ఉంది. ఎందుకంటే కొందరు నెటిజన్లు పవన్ ని ప్రజారాజ్యం డొనేషన్స్ లిస్టు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయమని ట్వీట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ పోస్ట్ చేసిన ఆ పిక్  2009 లోవి అంటే అప్పటికి పవన్ కూడా ప్రజారజ్యంలోని యువరాజ్యం అద్యక్ష్యుడిగా పని చేస్తున్నారు. టీడీపీ డొనేషన్స్ బయట పెట్టిన పవన్ కి ప్రజారాజ్యం డొనేషన్స్ బయట పెట్టడం పెద్ద విషయం కాదు, అందుకే అవి కూడా బయట పెట్టి పవన్ తన నిజాయితీ నిరూపించుకోవాలని కోరుతున్నారు నెటిజన్లు. దీనికి పవన్ ఏమని సమాధానం చెబుతాడో చూడాలి మరి.