సైలెంట్‌గా కానిచ్చేసిన రామ్‌ చరణ్‌

Ram Charan Boyapati Srinu movie first schedule Finished

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బోయపాటిల కాంబినేషన్‌ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెల్సిందే. ఒక వైపు ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్న రామ్‌ చరణ్‌ మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత అంటే ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో బోయపాటి శ్రీను చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడని అంతా భావించారు. అయితే తాజాగా ‘రంగస్థలం’ చిత్రానికి చిన్న బ్రేక్‌ ఇచ్చి బోయపాటి మూవీ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న బోయపాటి మూవీ రెండవ షెడ్యూల్‌ను వచ్చే నెల చివర్లో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం కొన్ని సీన్స్‌ మరియు ఒక పాట షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉంది. అందుకు సంబంధించిన సీన్స్‌ను షూట్‌ చేసి మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు బోయపాటి సగంకు అటు ఇటుగా చరణ్‌తో మూవీని పూర్తి చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

చరణ్‌, బోయపాటిల కాంబో మూవీ వచ్చే దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో పాటు రాజమౌళికి చరణ్‌ డేట్లు ఇచ్చిన నేపథ్యంలో బోయపాటి త్వర త్వరగా సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో చరణ్‌ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వచ్చే సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో మూవీతో చరణ్‌ రాబోతున్నాడు.