చరణ్‌ మూవీ టైటిల్‌పై క్లారిటీ

Ram Charan Boyapati Srinu Movie Title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్‌ చరణ్‌ తాజాగా ‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత చరణ్‌ చేయబోతున్న సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం చరణ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ రాజ వంశస్తుడిగా నటిస్తున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు మొదట రాజవంశస్తుడు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు మూడు టైటిల్స్‌ ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రానికి ‘రాజమార్తాండ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి నిర్మాత రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాలో వస్తున్న టైటిల్‌ వార్తలపై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకు ఇప్పటి వరకు టైటిల్‌ను ఖరారు చేయలేదని, సినిమా షూటింగ్‌పైనే ప్రస్తుతం పూర్తి దృష్టి ఉందని, తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా దర్శకుడు టైటిల్‌ను నిర్ణయిస్తాడు అంటూ నిర్మాత దానయ్య చెప్పుకొచ్చాడు. సినిమా పూర్తి అయ్యే వరకు టైటిల్‌ను నిర్ణయించే అవకాశం లేదని కొందరు అంటున్నారు. బోయపాటి ఎక్కువగా తన సినిమాలు పూర్తి అయిన తర్వాత లేదా చివరి దశలో ఉన్న సమయంలో టైటిల్‌ను ప్రకటిస్తాడు. అలాగే ఈ సినిమాకు కూడా విడుదలకు ముందు వరకు టైటిల్‌ విషయంలో సస్పెన్స్‌ను కొనసాగిస్తాడేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌కు జోడీగా ఈ చిత్రంలో భరత్‌ లవర్‌ కైరా అద్వానీ నటిస్తుంది. ఇక బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.