యాదృశ్చికమా లేదా కావాలని చేస్తున్నారా?

Ram Charan NTR and Rajamouli Multistarrer Cast And Crew details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోుగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ జక్కన్న అధికారిక ప్రకటన చేశాడు. మూడు ఆర్‌లతో ఒక లోగోను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో రాజశేఖర్‌ నటించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. రాజశేఖర్‌ విలన్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. ఇక రాశిఖన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లతో పాటు రష్మిక మందానలను హీరోయిన్స్‌గా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాజమౌళి, రామ్‌ చరణ్‌, రామారావులతో పాటు ఇంకా పలువురు ‘ర’ పేరు ఉన్న వారు ఈ చిత్రంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి కావాలని ఎక్కువ ‘ఆర్‌’ అక్షరాల పేర్లు ఉన్న వారిని తీసుకుంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా యాదృశ్చికమే అని, రాజమౌళి కావాలని ఇలా చేయడు అంటూ కొందరు చెబుతున్నారు. ఒక వేళ రాజశేఖర్‌ను విలన్‌గా ఎంపిక చేసుకుని, రాశిఖన్నా, రష్మిక మదానిలను హీరోయిన్స్‌గా ఎంపిక చేస్తే మొత్తం 6 ఆర్‌లతో ఈ చిత్రం ఉండబోతుంది. వచ్చే అక్టోబర్‌ ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. వచ్చే సంవత్సరం చివర్లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.