జక్కన్న, ఎన్టీఆర్‌, చరణ్‌ల మూవీ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

Ram Charan NTR and Rajamouli multistarrer movie budget

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి త్వరలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. మల్టీస్టారర్‌ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాని సోషల్‌ మీడియాలో సినిమా గురించి వార్తలు ఏ రేంజ్‌లో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిబ్రవరి నుండి ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం పనులు ప్రారంభం కాబోతున్నాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు వచ్చే సంవత్సరం ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. 2019లో ఈ భారీ మల్టీస్టారర్‌ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.

తాజాగా ఈ చిత్రం బడ్జెట్‌ గురించి సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానయ్య నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. దానయ్య ఒక ప్రముఖ నిర్మాతతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పారితోషికంతో కలిపి మొత్తంగా 150 కోట్లను దానయ్య ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దానయ్య ఈ విషయమై సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. మీడియాలో పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాని ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. జక్కన్న ఈ ఉత్కంఠకు తెర దించాలని, దయచేసి ఎవరైనా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని ప్రేక్షకులు కోరుతున్నారు.