చిరుతో పొలిటికల్ గా రామ్ చరణ్ విభేదం.

ram-charan-opposes-chiru-politically

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే ఓ స్పష్టత వస్తోంది. Nda నుంచి బయటకు రావడం ద్వారా చంద్రబాబు ఇక్కడ బీజేపీ తో ఇంకో పార్టీ బహిరంగంగా పొత్తు పెట్టుకోలేని పరిస్థితి తెచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా అస్త్రంతో ఒంటరి పోరు చేయబోతోంది. ఆ పార్టీ ఈసారి ఎలాగైనా తన గౌరవం కాపాడుకునే ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేస్తోంది. ఈ ప్రయత్నాలే కాంగ్రెస్ లో కొనసాగుతూ జగన్ లేదా పవన్ గెలవాలని కోరుకునే వాళ్లకి ఇబ్బందిగా వుంది. కాంగ్రెస్ గొడుగు కింద వుంటూ తమకు నచ్చిన వాళ్ళని గెలిపించుకోడానికి ట్రై చేసే వాళ్లకి బ్రేకులు వేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. జగన్ మీద సానుభూతి కురిపిస్తున్న తమ నాయకులకు తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ పాటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో ఒక్క జగన్ కి మాత్రమే పరిమితం కాలేదు ఆయన. పవన్ మీద కూడా ఓ కన్ను వేశారు.

సైరా షూటింగ్ తో బిజీబిజీ గా వున్న చిరంజీవితో ఈ మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం ప్రచారం చేయాలని కోరారట రాహుల్. పవన్ జనసేన రంగంలో వున్నప్పుడు చిరంజీవి సీన్ లోకి వస్తారో , రారో తెలుసుకునేందుకు రాహుల్ ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ కి బదులు ఇస్తూ ఎన్నికలకు ఓ రెండు నెలల ముందు రంగంలోకి దిగి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తాం అని చిరంజీవి మాట ఇచ్చారట. ఓ వైపు బీజేపీ చెప్పినట్టు చేస్తున్న పవన్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రశ్న లేదు. అలాంటప్పుడు ఈసారి కింగ్ మేకర్ కాకుండా కింగ్ కావాలని తలపోస్తున్న పవన్ కి వ్యతిరేకంగా చిరు ప్రచారం చేయాల్సి వస్తుంది.

ఇలాంటి పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని మెగా క్యాంపు లోని కుర్ర హీరోలు ఈ మధ్య పవన్ ఎస్ అంటే ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తామని ప్రకటించారు. అందులో రామ్ చరణ్ తేజ్ కూడా వున్నారు. అంటే రామ్ చరణ్ 2019 లో పవన్ తరపున , చిరు కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాల్సి ఉంటుంది. అంటే పాలిటిక్స్ లో చిరుతో రామ్ చరణ్ విభేదించడమే అవుతుంది.