హీరో రామ్‌చరణ్ రాజమండ్రికి హాయ్ చెప్పారు. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో చరణ్, కియారాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
పుణే షెడ్యూల్ తర్వాత కొంతగ్యాప్ తీసుకున్న చరణ్ మళ్లీ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ‘దిల్’రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు హర్షిత్ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.