ఎన్టీఆర్ ని డిన్నర్ కి పిలిచిన మెగా హీరో.

Ram Charan Tej invites to NTR for Dinner

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మా హీరో గొప్ప అంటే… మా హీరో ఇంకా గొప్ప అంటూ స్టార్ హీరోల అభిమానులు పోటీ పడుతున్నారేమో గానీ ఆ హీరోలు మాత్రం హాయిగా ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు. తమ మాటలు, చేతలతో అభిమానం అంటే ఇతరుల మీద ద్వేషం కాదని చెబుతున్నారు. తాజాగా అలాంటి విషయమే ఒకటి ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది.

జైలవకుశ ఎన్టీఆర్ కి మరో భారీ హిట్ గా నిలిచింది. క్రిటిక్స్ మాట ఎలా వున్నా అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. ఇప్పటికే 100 కోట్ల మార్క్ దాటిన ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ ఒక ఎత్తు అయితే అందులో జై పాత్ర నటుడిగా ఎన్టీఆర్ కెరీర్లో మరో ఎత్తు. ఆ పాత్రలో ఎన్టీఆర్ నటనకి విమర్శకులు సైతం ఫ్లాట్ అయిపోయారు. ఈ సినిమా చూసిన కొణిదెల వారి అబ్బాయి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అభినందనలు చెప్పాడంట. జై పాత్రలో ఎన్టీఆర్ యాక్షన్ గురించి పదేపదే ప్రశంసలు కురిపించాడు అంట. పైగా జైలువకుశ హిట్ సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకోడానికి డిన్నర్ కి పిలిచాడట. అందుకు ఎన్టీఆర్ కూడా ఓకే అన్నట్టు సమాచారం. ఈ మ్యాటర్ తెలిసాక అయినా నందమూరి, మెగా ఫాన్స్ లో కొందరు తాము పుట్టుకతో శత్రువులు అన్నట్టు వ్యవహరించకుండా ఉంటారని ఆశిద్దాం.