కొరటాల, రాజమౌళిల కంటే ముందు బోయపాటితో..!

Ram charan to do with Boyapati srinu Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చరణ్‌ మూవీ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఆమద్య కొరటాల శివ కూడా చరణ్‌తో మూవీపై ఒక ప్రకటన చేశాడు. ప్రస్తుతం మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే చరణ్‌తో సినిమా చేస్తాను అంటూ ప్రకటించాడు. అయితే అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా లేదు. మహేష్‌తో సినిమా కాస్త ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చరణ్‌ మరో సినిమాను పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తుంది.

ప్రస్తుతం చేస్తున్న ‘రంగస్థలం’ చిత్రం వచ్చే డిసెంబర్‌లో పూర్తి కాబోతుంది. అదే సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ మూవీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చరణ్‌ కోసం చాలా కాలం క్రితమే బోయపాటి శ్రీను ఒక స్టోరీని సిద్దం చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు అదే కథతో మళ్లీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెళ్లడి చేయనున్నట్లుగా తాజాగా బోయపాటి ప్రకటించాడు. బోయపాటి శ్రీను ఒక పక్కా మాస్‌ మసాలా కథను రామ్‌ చరణ్‌ కోసం సిద్దం చేశాడు. ఆ కథకు చరణ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. డిసెంబర్‌లో సినిమాను ప్రారంభించి వచ్చే దసరాకు సినిమాను విడుదల చేయాలని బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు.