“నీవు చేసే మంచి ప‌నులు నీకు త‌ప్ప‌కుండా పేరును తెచ్చిపెడుతాయి”

"నీవు చేసే మంచి ప‌నులు నీకు త‌ప్ప‌కుండా పేరును తెచ్చిపెడుతాయి"

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, హీరో రామ్‌చ‌ర‌ణ్ భార్య కామినేని ఉపాస‌న నేడు 31వ‌ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా చెర్రీ త‌న అర్ధాంగికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “నీవు చేసే మంచి ప‌నులు నీకు త‌ప్ప‌కుండా పేరును తెచ్చిపెడుతాయి” అని రాసుకొచ్చారు. దీనికి ఉపాస‌న ఫొటో జ‌త చేశారు. అందులో పూల హ‌రివిల్లు మ‌ధ్య కూర్చున్న ఉపాస‌న దూరంగా దేన్నో నిశితంగా చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె పేరు గాంచిన విష‌యం తెలిసిందే.

భ‌ళ్లాల దేవ రానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెర్రీ, ఉపాస‌న‌తో క‌లిసి దిగిన ఫొటోను పంచుకుంటూ బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, ప‌లువురు సెల‌బ్రిటీలు మెగా కోడ‌లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్తున్నారు.. అబిమానులు సైతం హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 2012 జూన్ 14న రామ్‌చ‌ర‌ణ్ ఉపాస‌న‌ను వివాహం చేసుకున్నారు. ఈ మ‌ధ్యే వీరి పెళ్లి బంధానికి ఎనిమిదేళ్లు పూర్త‌య్యాయి