చరణ్‌, అఖిల్‌ మూవీ…!

Ram Charan To Produce Boyapati Next With Akhil Akkineni

అక్కినేని అఖిల్‌ ప్రస్తుతం తన మూడవ చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’ను చేస్తున్న విషయం తెల్సిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం జనవరిలో విడుదల కాబోతుంది. ఇక అఖిల్‌ నాల్గవ సినిమా గురించి సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అఖిల్‌ నాల్గవ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యాక్షన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్‌ ఒక చిత్రం చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే నాగార్జున స్వయంగా బోయపాటితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మాస్‌ సినిమాలు చేయడంలో సిద్ద హస్తుడు అయిన బోయపాటి దర్శకత్వంలో అఖిల్‌ సినిమా దాదాపుగా ఖరారు అయినట్లే అంటూ సమాచారం అందుతోంది.

akhil charan boyapati srinu

ప్రస్తుతం బోయపాటి ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని చరణ్‌తో చేస్తున్నాడు. సంక్రాంతికి ఆ సినిమా విడుదల కాబోతుంది. ఈ సమయంలోనే బోయపాటితో చరణ్‌ ఒక సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. తన బ్యానర్‌లో సినిమా చేయాల్సిందిగా బోయపాటికి చరణ్‌ అడ్వాన్స్‌ ఇచ్చాడట. అఖిల్‌ నాల్గవ సినిమాను బోయపాటి దర్శకత్వంలో నిర్మించేందుకు చరణ్‌ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసం స్క్రిప్ట్‌ కూడా సిద్దం చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి బోయపాటి వినయ విధేయ రామ చిత్రంను పూర్తి చేసి, వెంటనే అఖిల్‌తో మూవీని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో అఖిల్‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో చరణ్‌ నిర్మాణంలో సినిమా ప్రారంభం కావడం ఖాయం అని తేలిపోయింది. దసరా కానుకగా చిత్రం వస్తుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఈ మెగా అక్కినేని కాంబో ప్రేక్షకులను ఇప్పటి నుండే ఊరిస్తోంది.

akhil-movie