ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.
‘విజయవాడలో ఓ లారీ డ్రైవర్గా ప్రారంభమైన ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పింది. నువ్వు లారీ టైర్లపై నిద్రిస్తూ.. ఫ్యామిలీకి అన్ని వసతులు ఏర్పాటు చేశావు.
నీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు.
మీ పిల్లల కోసం పెద్ద కలలు కని వాటిని నెరవేర్చినందుకు థ్యాంక్స్ తాతయ్య. మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ అని రామ్ ట్వీట్ చేశాడు.