హీరోయిన్ కాళ్ళపై పడ్డ రామ్ గోపాల్ వర్మ

హీరోయిన్ కాళ్ళపై పడ్డ రామ్ గోపాల్ వర్మ

సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసినా అందరికన్నా కాస్త భిన్నంగానే ఉంటుంది. మొన్నటి వరకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో బిజీగా ఉన్న వర్మ, తాజాగా ఆయన రూపొందిన చిత్రం బ్యూటిఫుల్‌ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు. అగ‌స్త్య మంజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 1న విడుద‌ల‌వుతుంది. సూరి, నైనా గంగూలి ఈ సినిమాలో జంట‌గా న‌టించారు.

అయితే ఇటీవ‌ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ నైనా గంగూలీతో వర్మ డ్యాన్స్ చేస్తూ చిందులు వేశాడు. అయితే నిన్న జ‌రిగిన ప్రీ న్యూ ఇయ‌ర్ ఈవెంట్‌లోనూ మ‌రోసారి వ‌ర్మ‌, నైనా కలిసి డ్యాన్స్ శారు. అభిమానులు, ప‌లువురు సినీ ప్రేక్ష‌కులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో అంద‌రూ చూస్తుండ‌గానే వ‌ర్మ‌ హీరోయిన్ నైనా కాళ్ళపై పడ్డాడు. అయితే కాసేపు షాక్‌కి గురీన నైనా వర్మను ప‌ట్టుకుని ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.