Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశం గురించి మాట్లాడటం లేదా ఏదైన విషయంను విమర్శించడం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలపై వర్మ విరుచుకు పడుతూ ఉంటాడు. మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి ఎప్పుడు గురవుతూ ఉండే వర్మ తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రంపై మాత్రం ప్రశంసలు కురిపించి అందరిని ఆశ్చర్య పర్చాడు. అసలు ఆ ట్వీట్ చేసింది వర్మనేనా అనే అనుమానాలు ఎక్కువ మందికి వ్యక్తం అవుతున్నాయి. వర్మ ఎప్పుడు ఎలాంటి ట్వీట్ చేస్తాడో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో కదా అని మరోసారి ఆయన గురించి చర్చ జరుగుతుంది.
ఇంతకు వర్మ ఏమని ట్వీట్ చేశాడంటే… రంగస్థలం టీజర్, పాట చూశాను, నాకు ఎంతో నచ్చింది. పాట సినిమాను మరో లెవెల్‌కు తీసుకు వెళ్లేలా ఉంది. అద్బుతమైన లిరిక్స్‌ను రాసిన చంద్రబోస్‌కు మరియు మంచి ట్యూన్ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌కు అభినందనలు అంటూ వర్మ ట్వీట్ చేశాడు. తాజాగా విడుదలైన ‘రంగస్థలం’లోని ఎంత సక్కగున్నావే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ పాట వర్మకు కూడా నచ్చడంతో అంతా కూడా షాక్ అవుతున్నారు. దర్శకుడు సుకుమార్‌పై ఉన్న అభిమానంతో వర్మ ఇలా ట్వీట్ చేశాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైతేనేం మొత్తానికి వర్మ చేసిన ట్వీట్‌తో రంగస్థలం స్థాయి మరింతగా పెరిగినట్లయ్యింది. షూటింగ్ పూర్తి చేసుకున్న రంగస్థలం చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.