ఎన్‌టి‌ఆర్ బ‌యోపిక్ లో అస‌లు స్టోరీ లేదంటున్న వ‌ర్మ‌…!

Ram Gopal Varma Sensational Comments About NTR Biopic

రామ్ గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ సినిమాను తెర‌కెక్కిస్తాను అంటూ పోయినా ఏడాది క్రిందే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. కాని వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ చిత్రంను ఇంకా మొద‌లు పెట్ట‌లేదు, ఈ సినిమాకు సంబందించిన టైటిల్ లోగోను మాత్రం అప్పట్లోనే రిలీజ్ చేశాడు. తాజాగా వర్మ సినిమాకు సంబందించిన ప్రీ ప్రోడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది, త్వ‌రలోనే ఈ సినిమాకు సంబందించిన ముఖ్య పాత్ర‌ల‌ను తేలియ‌జేస్తాను అని ప్ర‌క‌టించాడు, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఎన్‌టి‌ఆర్ బ‌యోపిక్ సినిమా చాలా సాప్ట్ గా ఉంటుంది.

ntr-bio-pic

ఆయన జీవితంలో జ‌రిగిన ముఖ్య‌మైన ఘ‌ట‌న‌లు ఏమీ ఉండ‌వు మ‌రి ముఖ్యంగా చంద్రబాబు కు మ‌రియు ఎన్‌టి‌ఆర్ సంబందించిన సన్నివేశాలు ఇప్పుటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుకూలంగా ఉంటాయి త‌ప్ప మ‌రేది చూపించ‌రు. అదే వ‌ర్మ ల‌క్ష్మీస్ య‌న్ టి ఆర్ చిత్రంలో రామ‌రావు గారికి ఏవ‌రు ఏ విదంగా ద్రోహం చేశారు త‌న సినిమా, రాజ‌కీయ మ‌రియు నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లను చూపిస్తాను అని వర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ను చేశాడు. మొదటి నుండి ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్నా వర్మ ఈ సారైనా సినిమాను తీసుకు వస్తాడేమో చూడాలి.

ram-gopal