వర్మ బంపర్ ఆఫర్…లక్ష ఇస్తాడట…!

RGV Announced 1 Lakh Reward To Find A Man

సినిమా ప్రకటించిన చాలా రోజుల తర్వాత ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రాజెక్టు విషయంలో దర్శకుడు రాంగోపాల్‌వర్మ నిద్ర లేచారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను వర్మ తాజాగా పోస్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో సర్వ్‌ చేస్తూ కనిపిస్తారు. వీడియోలో కనిపించిన వ్యక్తిని వెతికిపెట్టాలని, అందుకు సాయం చేసిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు. [email protected] జీమెయిల్‌కు వివరాలు పంపాలని వర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్‌ట్రూస్టోరీ (#NTRTRUESTORY) అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు.

 

ram-gopal-varma

అయితే కేవలం ఆ వీడియోలో కనిపించిన వ్యక్తిని మాత్రమే కనుక్కుని తనకు చెప్పాల్సిన అవసరం లేదని, అదే (చంద్రబాబు లాంటి) పోలికలతో ఉన్న మరోకరి వివరాలను అయినా తాను చెప్పిన జీమెయిల్‌ ఐడీకి పంపించాలని కోరారు. కాగా, అందరికంటే ముందుగా అలాంటి వ్యక్తి వివరాలు పంపిన తొలి వ్యక్తి తాను ఇచ్చే లక్ష రూపాయల రివార్డుకు అర్హుడవుతాడని వర్మ మరో ట్వీట్ చేశారు. తన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో చంద్రబాబు పాత్రలో ఆ వ్యక్తికి వర్మ ఛాన్స్ ఇవ్వనున్నారని భావిస్తున్నారు.