‘కమ్మ కులస్తులే నిజమైన రాజులు’ అని చెప్పిన రాంగోపాల్ వర్మ

కమ్మ కులస్తులే నిజమైన రాజులు అని చెప్పిన రాంగోపాల్ వర్మ

నిరంతరం సంచలనాలతో సహవాసం చేసే ప్రముఖ సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ, తాజాగా మరికొన్ని సంచలన వాఖ్యలు చేశారు. అయితే ఇది అంత కొత్త విషయం ఏమి కానప్పటికీ కూడా కాస్తంత ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పాలి. కాగా రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని పక్కగా అర్థమవుతుంది. కాగా ఇప్పటికే విడుదలైనటువంటి ఈ చిత్ర ట్రైలర్ రాష్ట్రంలో కొన్ని సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పాలి. అయితే ఈమేరకు ప్రైవేట్ మీడియా ఛానల్ వారు ఆర్జీవీ ని ఇంటర్వ్యూ చేయగా, ఆ సందర్భంగా మాట్లాడిన ఆర్జీవీ కొన్ని సంచలన వాఖ్యలు చేశారు.

కాగా “తనకు మరో జన్మ అంటూ ఉంటే కమ్మవాడిగానే పుడతానని వర్మ స్టేట్ మెంట్ ఇచ్చాడు మన రాంగోపాల్ వర్మ. అంతేకాకుండా తాను స్వతహాగా రాజుల సామజిక వర్గానికి చెందినవాడని, తన కులస్తులందరు కూడా సాత్వికులు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తను కమ్మ కులానికి పెద్ద అభిమానినని, కమ్మ కులస్తులే నిజమైన రాజులని చెప్పారు. అందుకని తనకు కమ్మ వాడిగా పుట్టాలని కోరికగా ఉందని వర్మ తన మనసులోని మాటని వెల్లడించారు.

13