వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే వర్మ ఎవరీ పోస్ట్‌పై ఎలా స్పందిస్తాడో చెప్పడం కష్టమే. సామాజీక అంశాలతో పాటు సినీ సెలబ్రెటీలపై, రాజకీయ నాయకులపై తనదైన శైలిలో స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు వర్మ. ఈ క్రమంలో ఆర్జీవీ చేసే పోస్ట్‌లు, ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఆయన మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నను టార్గెట్ చేశాడు. మంచు లక్ష్మికి సంబంధించిన ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేస్తూ ఆమెపై షాకింగ్ కామంట్స్ చేశాడు. ‘హే మంచు లక్ష్మి.. నువ్వు చేయలేనిదంటూ ఏం లేదా? దీనికి ముగింపు ఉండదా? ఇది నువ్వేనా ఇప్పటికి నమ్మలేకపోతున్నా’ అంటూ మంచు లక్ష్మిని ప్రశంసించాడు. ఇక వర్మ తన ఫొటోపై సానుకూలంగా స్పందించడంతో మంచు లక్ష్మి తెగ మురిసిపోయింది. ఆర్జీవీ కామెంట్స్‌పై స్పందిస్తూ ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.