దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు వివాదాలలో ఉంటారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రం ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వర్మ చిత్రీకరించిన “కమ్మరాజ్యంలో కి కడపరెడ్లు” అనే కొత్త సినిమాతో తో మళ్ళీ వివాదస్పదాలలో ఉన్నారు. కాగా అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ వర్మ చెబుతున్నాడు.
దీపావళి సందర్భంగా సినిమా ట్రైలర్‌ను వర్మ విడుదల చేయగా ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఒకవర్గాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నది. ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులని ఆకర్షించి యూట్యూబ్‌లో కమ్మరాజ్యంలో కి కడపరెడ్లు సినిమా ట్రైలర్ టాప్ ట్రెండ్‌గా నిలిచింది.
ఏపీ మాజీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ను పప్పు అంటారని తెలిసే ఆ సీన్ పెట్టారని ఫోన్ కాల్ లో ఒక వ్యక్తి వర్మతో చెప్పారు. పప్పువడ్డించే సీన్ హైలైట్ అని వర్మతో కాల్ చేసిన వ్యక్తి చెప్పారు. ఎందుకు నచ్చిందని రామ్ గోపాల్ వర్మ వెంటనే ప్రశ్నించగా ఏమి చెప్పకుండా అవతలి వ్యక్తి ఉన్నాడు. దీనిపై వర్మ లోకేశ్‌ని పప్పు అంటారా.. తెలీదు.. ఫస్ట్ టైమ్ వింటున్నా అని వర్మ తన స్టైల్ లో చెప్పారు. మీకేవారు లోకేష్ ని అలా అంటరాని వర్మ ప్రశ్నించగానే..సోషల్ మీడియా ద్వారా పప్పు అని అంటారని తెల్సు అని అవతలి వ్యక్తి చెప్పాడట.